31-10-2025 12:31:59 AM
 
							- అన్ని తెలిసినా తెలియనట్టు వివరిస్తున్న అధికారులు
- కాంట్రాక్టర్లు ఆడిందే ఆట.. పాడింది పాట
- అటువైపు చూడని ఉన్నత అధికార యంత్రాంగం
- ప్రతి దానికి ఓ లెక్కుంది..
- జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పర్యవేక్షణ లేదా!
నారాయణపేట. అక్టోబర్,30(విజయక్రాంతి) : అన్ని విషయాలు అధికారులకు తెలిసిన అక్కడ ఏమి జరగట్లేదు అంత నిజాయితీగానే జరుగుతుంది అన్నట్టు వ్యవహరి స్తున్నారు. చిన్న కరెంటు మీటర్ నుంచి విద్యుత్ కనెక్షన్ కావాలనుకున్న నిబంధనల కంటే ఎక్కువ మామూళ్ళు ముట్ట చెప్పాల్సిం దే. ట్రాన్స్ఫార్మర్, ప్రభుత్వ కార్యాలయాలు, అనధికార వెంచర్లు.రైస్ మిల్లులు విషయానికి వస్తే ఈ అంచనాలు అంకెలు అధికారు లు కాంట్రాక్టర్లు కలిసి ఎంత చెబితే గంతే అంటున్నారు విద్యుత్ వినియోగదారులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం అటువైపు చూడడమే మానేసింది.
ఈ అంశాలను పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకుం టూ జిల్లాలో కాంట్రాక్టర్ లతో అధికారుల కుమ్మక్కుఅనే శీర్షిక గురువారం నాడు వెలువడింది పాఠకులకు తెలిసిందే ముఖ్యంగా విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మ క్కు సంఘటన లో భాగంగానే ప్రధానంగా జిల్లా కేంద్రంలో డిఈ కనుసన్నల్లో పనులు కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజి తీసుకొని పనులు అప్పచెప్పి సొమ్ముచేసు కుంటున్నట్లు కొంత మంది సహచర కాంట్రాక్టర్ లు చెబుతున్న మాట .
కాంట్రాక్టర్ లతో దావత్ పేరిట విందులు, వినోదాల తో పాటు కమీషన్ తీసుకొని ప నులు చేస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా పేట జిల్లా కేంద్రంలో చేనేత భవనానికి ఎలాంటి టెండర్లు స్వీకరించకుండానే కమీషన్ తీసుకొని ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక్కరికే పనులు అప్పగించడం వెనుక ఉన్న అంతరిమేమిటో అధికారులు చెప్పాలి . ఇదిలా ఉండగా మద్దూరు, కోస్గి మండలాలకు చెందిన కాంట్రాక్టర్లుకు పనులు అప్పచె ప్పటం పరిపాటిగా మారింది. ఏది ఏమైనా సరే నాకు మామూళ్ళు వస్తున్నాయా..? లేదా?అన్నది ఆయనకు ఆయనే పొరపాటుగా మారినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా మక్తల్ నియోజకవర్గంలో విద్యుత్ పనుల విషయంలో సంబంధిత అధికారులపై ఓ హైదరాబాద్ కాంట్రాక్టర్ ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వమని దరఖాస్తు చేయగా సమాచారం ఇవ్వకపోగా ఆ విషయమై డి ఇ స్వయంగా తన వాహనంలో సంబంధిత ఏఈ లు, ఏ డి లను వెంట తీసుకుని వెళ్లి ఆ కాంట్రాక్టర్ తో పరిష్కారం చేసుకొన్నట్లు బహిరంగంగా ఇతర కాంట్రాక్టర్ లు చర్చించుకుంటున్నారు.మరి ఇంత బహిరంగంగా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అటువంటి వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. కాసులు కురిపిస్తున్న అనధికార వెంచర్లు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ శాఖ అధికారి తన జేబుల్లోకి వేసుకొంటుంటే మరి జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా సూపరింటెండెంట్ అధికారికి తెలియకుండా పనులు ఎలా చేస్తారని మిగతా కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు.
ఏది ఏమైనా ఇంతవిద్యుత్ శాఖలో ఇన్ని అక్రమాలు చోటు చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నారా అని విమర్శ లు సైతం ఉన్నాయి. విద్యుత్ వినియోగదారులు ఏమైపోయినా పర్వాలేదు సంబంధిత అధికారులు మాత్రం కాంట్రాక్టర్లు బాగుపడితే చాలు అన్నట్టుఉంది .నారాయణపేట జిల్లాలో విద్యుత్ అధికారుల తీరు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ అంశంపై వినియోగదారులు సైతం తీవ్ర నిరాశకు గురి అవు తున్నప్పటికీ వారిని ఓదార్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాం గం నియమ నిబంధనలను అమలు చేస్తూ అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు చెబుతున్న మాట.
అంతా ఒక పద్ధతి ప్రకారం...
కాంట్రాక్టర్ల కు ఎవరికి ఏ రకమైనటువంటి పని కావలసి ఉన్న ఆ పనికి సంబం ధించి టెండర్ వేయవలసి ఉంటుంది. ఈ శాఖలో ఆ నిబంధనలు ఏం చెల్లవు. పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టులో డీటెయిల్ రాకుండా అన్ని అక్కడే కార్యాలయంలో కార్యక్రమం అంతా పూర్తి చేసినప్పటికీ అక్కడే పోస్టల్ నుంచి వచ్చినట్టు టెండర్లు తీస్తారు నచ్చిన వారికి ఇస్తారు.. అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఇక్కడ ఎవరికి ఏ పని కావాలో ఉన్నత అధికారులు మాత్రమే నిర్ణయిస్తారు.
ప్రజాప్రతినిధులు సైతం ఇందుకు మద్దతు పలుకుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విధానానికి ఇచ్చేవరకు నియమ నిబంధనలకు స్వాగతం పలకాలని కాంట్రాక్టర్లతోపాటు వినియోగదారులు ఆసక్తి కనపరుచుతున్నారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా పనులు చేస్తుంటే విజిలెన్స్ అధికారులు నిద్ర పోతున్నారా అనే విమర్శలు సైతం ఉన్నాయి ఇకనైనా అనధికార టెండర్ల పనులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.