calender_icon.png 11 July, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరకపట్టి పొలం దున్నిన మెదక్ కలెక్టర్

23-06-2025 12:00:00 AM

నకిలీ విత్తనాల అమ్మితే కఠిన చర్యలు..ఎల్లంపల్లి తండాలో పత్తి పంట పరిశీలన

మెదక్, జూన్ 22(విజయక్రాంతి): రైతు భరోసా డబ్బులు అర్హులైన ప్రతి రైతు కుటుంబాలకు జమ చేయబడుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ పొలం బాట పట్టారు. నిత్యం బిజీగా ఉంటూ ఆదివారాలు సెలవు రోజులను చూడకుండా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రగతిని పరిశీలిస్తూ జిల్లాలో సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంలో టేక్మాల్ మండలం ఎల్లంపల్లి తండా మిట్టల్ అనే రైతుకు సంబంధించి పత్తి పంటను పరిశీలించారు. రైతు మిట్టల్ను పత్తి పంట సాగు వివరాలను క్షుణంగా అడిగి తెలుసుకున్నారు. పత్తిలో చీడపీడలు నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, దిగుబడి వివరాలు  అడిగిన కలెక్టర్. ప్రస్తుత వాతావరణ ప్రతికూల అనుకూల పరిస్థితులు ప్రభావం తెలియజేస్తూ  అరక పట్టి పొలం దున్నారు.

స్వయంగా కలెక్టరే వచ్చి పత్తి పంట సాగు వివరాలు తెలుసుకోవడంతో రైతు మిట్టల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని, నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతు భరోసా డబ్బులు రైతు భరోసా కింద ఆదివారం వరకు జిల్లాలోని 2,54,504 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 207,14,20,772 రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సాగు అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయనతెలిపారు.