calender_icon.png 11 September, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగుంటలో చాకలి ఐలమ్మ వర్థంతి

11-09-2025 01:35:45 AM

చేగుంట, సెప్టెంబర్ 10 :చేగుంట మండలం వడియారం పట్టణ ఆవరణలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి 40 వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు సిహెచ్.రామచంద్రం, మాజీ సర్పంచ్ తిరుమల నర్సిములు, అంకన్న గారి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అడుగుజాడలో రజకలందరు నడవాలని పిలుపునిచ్చారు.

ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో, పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ, రజక గ్రామ అధ్యక్షుడు సి హెచ్ లింగం, బాలేష్, శంకర్, రామస్వామి, నరసయ్య, అంజయ్య, శ్రీకాంత్, సిద్ధిరాములు, శంకర్, పాండు, సత్యనారాయణ, యాదగిరి,పాల్గొన్నారు.