calender_icon.png 11 September, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

11-09-2025 01:34:24 AM

జిల్లా కలెక్టర్ కె హైమావతి

కొండపాక,సెప్టెంబర్ 10: రైతులు భూ సమస్యలపై చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రెవెన్యూ అధికారులను సూచించారు .బుధవారం కొండపాక మండలంలోని సమీకృత కార్యాలయ సముదాయంనీ జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి తహసిల్దార్ కార్యాలయంలో భూ భారతి పెండింగ్ అప్లికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భూ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టం అమలులో ప్రజల నుంచి భూ సమస్యల పై వచ్చిన దరఖాస్తులను భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియలో అన్ని శాంక్షన్ ఇండ్లు 100% గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కట్టుకోడానికి సుముఖంగా లేనివారికి నోటీస్ ఇచ్చి పేరు తొలగించి మరొక లబ్ధిదారులకు మంజూరు చెయ్యాలని తెలిపారు.

అలాగే ఆయా స్థాయిలో పే మెంట్, ఫోటో క్యాప్చర్ చేసి అప్లోడ్ పెండింగ్ వివరాల గూర్చి ఆరా తీశారు. నిర్మాణం లో ఉన్న ఇల్లు వేగంగా పూర్తి అయ్యేలా రోజు పర్యవేక్షణ చెయ్యాలని ఎంపీడీవో ని ఆదేశించారు. సమావేశంలో తహసిల్దార్ శ్యామ్, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు తదితరులుపాల్గొన్నారు.