calender_icon.png 23 October, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30న విద్యాసంస్థల బంద్: ఎస్‌ఎఫ్‌ఐ

23-10-2025 12:48:21 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఈనెల 30న ఇంజినీరింగ్, ప్రొఫె షనల్, డిగ్రీ, పీజీ, యూనివర్సిటీ విద్యాసంస్థలు బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్స్‌షిప్స్ విడుదల చేయాలని, ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులను డిమాండ్ చేసి వసూళ్లు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌తో సహా అన్ని ఉన్నత విద్యాసంస్థల బంద్‌ను చేపట్టనున్నట్లు తెలిపింది.