26-08-2025 01:16:50 AM
* శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్
* గోడలకు రంగులేసిన కాంగ్రెస్ ముఖ్యులు
* చొప్పదండి నియోజక వర్గంలో రెండో రోజుజనహితపాదయాత్ర
గంగాధర, ఆగస్టు 25 (విజయక్రాంతి) రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పాద యాత్రల ద్వారా వివరించడంతో పాటు శ్రమదాన కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం జరుగుతుందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ లు తెలిపారు.
జనహిత పాద యాత్ర కార్యక్రమం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ లు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టల్ ఆవరణలోని గుంతల్లో మట్టిని పోయడంతో పాటు ప్రహరీ గోడకు రంగులు వేసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. కిచెన్ గార్డెన్ ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. హాస్టల్ ఆవరణలో మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ లు పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రమ దాన కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. శ్రమదాన కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయి ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.