06-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు 5(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సోన్ లక్ష్మణ్ చందా మామడ మండలాలకు సాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సరస్వతీ కెనాల్‌కు నీటిని విడుదల చేయించాలని రైతులు మంగళవారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుకు వినతి పత్రం అందజేశారు.
సరస్వతి కెనాల్ కింద వరి సాగు చేసే రైతులకు నీరు విడుదల చేస్తే ప్రయోజనంగా ఉంటుందని వారు వివరించారు. ప్రాజెక్టులో నీరు ఉన్నందున నేటి విడుదల చేయించాలని వారు కోరగా ఉన్నతాధికారులను సంప్రదించి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటారని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల రైతులు నాయకులు పాల్గొన్నారు.