06-08-2025 12:00:00 AM
తాండూరు, ఆగస్టు 5 (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఎర్రగడ్డ తండాలోఎర్రగడ్డ తండావాసులు తెలిపి న వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయని, దీం తో ఏం జరుగుతుందోనని భయాందోళనలకు గురయ్యమని పిల్లాపాపలతో తండావాసులు అంతా రోడ్లపైకి వచ్చామని తెలిపారు. ఏకధాటిగా భారీ శబ్దాలు రావడంతో గ్రా మానికి సరఫరా అయ్యే విద్యుత్ ను తామే నిలిపివేశామని అన్నారు.
ఉదయం 8 గంట ల వరకు సైతం పేలుడు శబ్దాలు వచ్చాయని అని గ్రామస్తులు అన్నారు. ఇక మరోవైపు గ్రామం లోని కమ్యూనిటీ భవనంలో కొనసాగుతున్న పాఠశాలను గ్రామపంచాయతీ కార్యాలయంలోకి మార్చమని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. శిథిలావస్థకు చేరిన కమ్యూనిటీ భవనం శబ్దాలకు ఏం జరుగుతుందోనని విద్యార్థుల క్షేమం కోసం నూ తనంగా నిర్మించిన పంచాయతీ భవనంలోకి ప్రస్తుతానికి మార్చామని ఉపాధ్యాయులు అన్నారు.
అయితే ఎర్రగడ్డ తాండకు సమీపంలో ఉన్న నల్ల రాతి గనుల్లో బ్లాస్టింగ్ చే సేందుకు గోతులు తవ్వినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఎర్రగడ్డ తండాకు చేరుకొని విచారణ చేపట్టారు.ఈ విషయమై తాండూర్ విజయక్రాంతి ప్రతినిధి డిఎస్పి బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించగా పేలుళ్లు జరిగినట్టు తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, పేలుళ్ల కోసం గోతులు తవ్విన విషయం తమ దృష్టికి వచ్చిందని...నల్ల రాతి గనుల్లో బ్లాస్టింగ్ కోసం నియోజకవర్గంలో ఎవరికి అనుమతులు లేవని.. శబ్దాలకు కారణం భూమి కంపించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు .పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామనిఅన్నారు.