01-10-2025 01:58:37 AM
ఆమనగల్, సెప్టెంబర్ 30: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆమనగల్ మున్సిపాలిటీలో మంగళవారం విజయదశమి కాషాయ జెండాల తోరణాల అలంకరణ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. వేడుకకు ముఖ్యఅతిథిగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని మాట్లాడారు. దసరా ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలంతా పండుగ వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
శాంతి భద్రతలకు విగాథం కలిగించకుండా పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలంతా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహన కమిటీ సభ్యులు కండే ప్రసాద్, అప్పం శీను గుర్రం కేశవులు, దుర్గయ్య, గోరటి నరసింహ, వస్పుల సాయిలు శ్రీకాంత్ సింగ్, మల్లయ్య, చెన్నకేశవులు, మానయ్య, చుక్క నిరంజన్ గౌడ్, కండె భాస్కర్, గోల్ రాము, రవిరాథోడ్, ఎర్రోవులు మహేష్,పద్మ ప్రశాంత్, శ్రీను నాయక్, వస్పుల రవి, చెక్కల సాయిలు పాల్గొన్నారు.