26-11-2025 12:07:09 AM
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 25, (విజయక్రాంతి):భారతీయ రాష్ట్ర సమి తి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ నెల 29న తలపెట్టిన దీక్ష దేవాస్ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు పె ద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కోరారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి బిఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన తాను తెలంగాణ సాధించిన తెలంగాణ బాపు కెసిఆర్ సారధ్యంలో బిఆర్‌ఎస్ లో చేరడం జరిగిందన్నారు. పదవులు తనకేమీ కొత్త కాదని ఎన్ని కష్టాలు ఎదురు దెబ్బలు తగిలిన నా కర్తవ్యాన్ని నిబద్దతతో కొనసాగిస్తానని స్పష్టం చేశారు.