26-11-2025 12:08:59 AM
ఔవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెం,నవంబర్ 25, (విజయక్రాంతి ):ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(ఈ ఎం ఆర్ ఎస్)లో ,ఖాళీ గా ఉన్న వివిధ పోస్టులలో నియమకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తగు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి భోదన, బోదనేతర సిబ్బంది కొరకై, దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యాలయంలో పని చేయుటకు, ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈఎంఆర్ స్ పాల్వంచ, రామవరం లో దరఖాస్తు ఫారం లభించును. దరఖాస్తు ఫారం ను పూర్తి చేసి సంబంధిత కార్యాలయంలో, అందజేయవలసిందిగా ప్రిన్సిపల్ ప్రసంజిత్ గోషాల్ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 25 నుండి తేది: డిసెంబర్ 10 లోగా మీకు అందుబాటులో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తి వివరాలతో సంప్రదించాలని తెలియజేస్తున్నారు.