26-09-2025 12:00:00 AM
నాగోల్‌లో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): భారతీయ జనసంఘ్(ఆ తర్వాత బీజేపీగా మారింది) వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాల్ 109వ జయంతిని నాగోల్ బీజేపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయనను మహనీయ తాత్వికు డు, ఆలోచనాపరుడు, ఆదర్శ నాయకుడు గా బీజేపీ నాయకులు గుర్తిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు నాగోల్ డివిజన్ పరిధిలోని పత్తులగూడ ప్రభుత్వ పాఠశాలలో బూత్ (103) అధ్యక్షుడు విగ్నేష్ ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్‌యాదవ్, బిజెపి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాగోల్ డివిజన్ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్, నాయకులు సిద్దాల ఐలయ్య, సంజీవరెడ్డి, కాలేయ శెట్టి లయ, నూకల పద్మరెడ్డి, పంగ శ్యామ్‌కుమార్, శివశంకర్, నరేందర్, చంద్రశేఖర్ గుప్తా, విజయశంకర్, బీజేవైఎం అధ్యక్షుడు వినోద్‌యాదవ్, బీజేవైఎం నాయకులు నరేష్ యాదవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.