26-09-2025 12:00:00 AM
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు
ఆళ్లపల్లి, సెప్టెంబర్ 25, ( విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామని, ఎవరు అధైర్య పడవద్దని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు గు రువారం మండల కేంద్రంలో పర్యటించారు. స్థానిక రైతు వేదికలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ప ట్టాలను అందించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలకు పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అనేక సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెటీలను అమలు చేయడం జరిగిందని,
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే నిరుపేద సొంతింటి కల సహకారం చేస్తూ ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడం జరిగిందని, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు ఇలా అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణ మరింత అభివృద్ధిపదంలో నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం మర్కోడు పరిధిలోని లొద్దిగూడెం గ్రామంలో నూతన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చదలవాడ అనూష విద్యాధికారి శాంతారావు వైద్యాధికారి సంఘమిత్ర వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం రామ నరసయ్య కో ప్రచార కమిటీ అధ్యక్షులు వాసం, శ్రీకాంత్. నియర్ నాయకులు పడిగే సమ్మయ్య పెండ పట్ల పాపారావు మహమ్మద్ అతహర్ తులం ముత్తి లింగం భరత్ శేఖర్ సుతారి కృష్ణ పాయం సూరయ్య యూత్ కమిటీ అధ్యక్షులు వాసం శ్రీనాథ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.