24-05-2025 08:29:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, మామడ, లక్ష్మణచందా, సొన్, సారంvగాపూర్ దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 158 మంది లబ్ధిదారులకు 45 లక్షల 41 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) లబ్ధిదారులకు అందజేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్, జిల్లా, పట్టణ, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.