27-12-2025 02:29:57 AM
రాష్ట్రంలో మరో రెండు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రానున్న రెండు రోజులు రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. శుక్రవారం తెల్లవారు జామున 3గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో గిన్నెధరిలో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ (రెడ్డిపల్లె)లో 8.9, ఆదిలాబాద్ జిల్లా గాంధి గూడ(లోకారి కే)లో 9.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారి(రామలక్ష్మణ్‌పల్లె)లో 9.6 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బంత్వారం(తొర్రిమామిడి)లో 9.8 డిగ్రీలు, నిర్మల్ జిల్లా పెంబీలో 10.0 డిగ్రీలు నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని శేర్‌లింగంపల్లిలో 10.0 డిగ్రీలు, మల్కాజ్‌గిరిలో 10.7 డిగ్రీలు, అల్వాల్‌లో 11.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.