27-12-2025 02:28:53 AM
ముషీరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): విద్యుదాఘాతంతో ఇద్దరు కవలలు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఇన్స్పెక్టర్ తల్లాజు జ్యోత్స్న తెలిపిన వివరాల ప్రకా రం.. కాచిగూడ, సుందర్ నగర్‌లోని అంజుమన్ బాడా ప్రాంతానికి చెందిన సయ్యద్ సైపుద్దీన్ ఖాద్రి నివాసం ఉంటున్నాడు. అతనికి ముగ్గురు. కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. అందులో 3 సంవత్సరాల ఇద్దరు కుమారులు ట్వీన్స్. తల్లిదండ్రులు బయట కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఏసీ షాట్ సర్క్యుట్ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఇంట్లో ఏసీ బ్లాస్ట్ కావడంతో మంట లు అంటుకొని వేగంగా వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న పిల్లులు ఇద్దరు బయటకు పరుగులు తీశారు. మూడు సంవత్సరాల ట్వీన్స్ పిల్లలు మాత్రం మంటల్లోనే చిక్కుకున్నారు. అందులో రహమన్ ఖాద్రీ (3) మృతి చెందాడు. రహీంఖాద్రీ (3) కాలిన గాయాలతో ఉస్మానియా దవాఖానా లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.