14-08-2025 12:20:45 AM
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్, ఆగస్టు 13: ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులు పెద్దశంకరంపేటలో తనపై, తమ కార్యకర్త జంగం శ్రీనివాస్ పై, ఆయన మెడికల్ షాప్‌పై దాడికి పాల్పడి హత్యా యత్నానికి ప్రయత్నించారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధ వారం నారాయణఖేడ్‌లో బిఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను శంకరంపేటలో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో తిరుగలేరని హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ నాయకులకు తరిమికొడతారని ఆరోపించారు.
తాము గతంలో మంజూరు చేయించిన పనులను కొనసాగిస్తున్నారు తప్ప నారాయణఖేడ్ ప్రాంతానికి కొత్త నిధులను తీసుకురాలేదని ఆరోపించారు. అభివృద్ధి పనులు నిధులు తీసుకురావడానికి చేతకాక తమపై లేనిపోని ఆరోపణలకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి దిగుతున్నాడని ఆరోపించాడు. ప్రజలకు ఉపయోగపడే బసవేశ్వర సంగమేశ్వర పథకాల పనులు మార్చి నల్లవాగు ఫ్లడ్ కెనాల్ పేరుతో రూ.90 కోట్ల మేర డీపీఆర్ చేయించి ఫెయిల్ అయ్యారని ఆరోపించారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్ నాయక్, అభిషేక్ షట్కార్, నారాయణఖేడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ రూబిన నజీబ్, పరమేశ్వర్, రామ్ సింగ్, మైపాల్ రెడ్డి, నగేష్ సెట్, వెంకటేశం, నవాబ్, దస్తగిరి, తదితరులుపాల్గొన్నారు.