25-11-2025 08:15:25 PM
చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల లోని స్థానిక గురుద్వారాలో మంగళ వారం శ్రీ గురు తేగ్ బహద్దర్ సాహిబ్ జీ 350వ వర్ధంతిని స్థానిక శిక్కులు శబద్ బాణీ కీర్తనలుతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గురు ధర్మ ప్రచార పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బహదూర్ సింగ్ మాట్లాడుతూ కాశ్మీర్ హిందూ పండితులు భారతదేశ హిందువులను, మా ధర్మ రక్షణ మీ ధర్మ సంస్థ (శిక్కుమతం) తోటే సాధ్యం అని శిక్కు మతధర్మ పీఠం తొమ్మిదవ గురువుగా ఉన్న శ్రీ గురు తేగ్ బహద్దర్ సాహిబ్ జీ వద్ద శరణు వేడితే ధర్మ పక్షమైన హిందువుల కోసం నిలబడి ఆనాటి పాలకుల నుండి హిందువులను కాపాడిన మానవతవాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంత్ సింగ్, ప్రేమ్ సింగ్, కుల్దీప్ సింగ్,పరమేశ్వర్ సింగ్, సికిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.