calender_icon.png 23 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేత

23-11-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, నవంబర్ 22 (విజయ కాంతి) : రాజేంద్రనగర్ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో వెలసిన  ఫుట్ పాత్ ల ఆక్రమణలను జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చి వేశారు. శనివారం ఉదయం ఆరాంఘర్ చౌరస్తాలోని శంషాబాద్ వెళ్లే మార్గంలోని పుట్ పాత్ లపై వెలసిన డబ్బాలు, కట్టడాలను జేసీబీలతో కూల్చివేశారు. అక్కడ ఉన్న తోపుడు బండ్లను సైతం తొలగించారు.

అదే విధంగా శివరాం పల్లి లోని పీవీ ఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 294 వద్ద గల పుట్ పాత్ అక్రమాణలను తోలగించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవంచానీయ సంఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా మైలార్దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్, అత్తా పూర్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు ల ఆధ్వర్యంలో భారీ పోలీసు బండిబస్తును ఏర్పాటు చేశారు.

శివరాం పల్లి వద్ద జరిగిన కూల్చివేతల సందర్బంగా పుట్ పాత్ యజమానులు, అధికారుల మధ్య కొద్దీ సేపు వాగ్వాదం జరిగింది. పక్కింటి యజమాని ఫిర్యాదు చేయడంతో కక్ష సాధింపుతోనే మా డబ్బాలను కూల్చివేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.