calender_icon.png 8 May, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

08-05-2025 12:11:31 AM

ఇబ్రహీంపట్నం, మే 7:ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి మంగల్ పల్లిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపించారు.  మున్సిపాలిటీ పరిధిలోని ఆదిభట్ల,టిసిఎస్, మంగళపల్లి లలో అనుమతులు లేకుండా పై పై అంతస్తుల భవనాలు  నిర్మిస్తున్న విషయం తన దృష్టికి వచ్చినట్లు కమిషనర్ బాలకృష్ణ పేర్కొన్నారు.  అట్టి భవనాలను గుర్తించి  ఇప్పటికే భవన యజమానులకు నోటీసులు పంపినట్లు ఆయన గుర్తు చేశారు.

దీంతో వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో  అనుమతి లేకుండా  చేపట్టే నిర్మాణాలపై  చర్యలు తప్పవని  ప్రభుత్వ నిబంధనల మేరకు కచ్చితంగా భవన యజమాన్యాలు  అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. లేనియెడలో అట్టి భవనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.