08-05-2025 12:12:37 AM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జాలే నరసింహారెడ్డి
దేవరకొండ, మే 07: దేవరకొండ మండల కేంద్రంలోనీ గాంధీనగర్‌లో దొడ్డి అశోక్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో విలేజ్ డెవలపింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ అండ్ టైలరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నూతన బ్యాచ్ ను పిఎసిఎస్ చైర్మన్ & రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జాలే నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం వారుమాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని విలేజ్ డెవలపింగ్ సొసైటీ యాజమాన్యాన్ని వారు అభినందించారు.విద్యార్థులు, మహిళలు టైలరింగ్ అండ్ కంప్యూటర్ రంగాలలో మంచిగా శిక్షణ పొందిస్వయం ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి కల్పిస్తూసంస్థ యాజమాన్యానికి మంచి పేరు తెస్తూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో చందంపేట మండల మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్,సంస్థ సభ్యులు పి నాగేంద్ర, నిహారిక ,లౌడ్యా భాషా నాయక్, నేనావత్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.