calender_icon.png 8 May, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదురు గాలులకు రేకుల షెడ్ నేల మట్టం

08-05-2025 12:10:10 AM

మోతె, మే7: మండల పరిధిలోని ఉర్లుగొండ గ్రామంలో మంగళవారం వీచిన ఈదురు గాలులకు ఓ రేకుల షెడ్డు నేలమట్టమయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసిం హ వైన్స్ షాపు రేకులు ఈదురుగాలులకు పైకి లేచి పడి పూర్తిగా  ధ్వంసం అయ్యాయన్నారు.

అయితే వైన్ షాప్ ఊరి మధ్యలో ఉండడంతో గాలికి లేచిన రేకులు నాలుగు బైక్ లు, ఒక ఆటోపై పడడంతో అవి తీవ్రంగా దెబ్బ తినడంతో పాటు ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో దవాఖానకు తరలించినట్లు తెలియజేశారు.