05-05-2025 02:19:44 AM
ఇబ్రహీంపట్నం, మే 4: మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దీంతో భవన యజమాను లంతా లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సెటిల్మెంట్ల కోసమే అక్రమ భవనాల కూల్చివేతలు చేపడుతున్నారని మున్సి పాలిటీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూల్చిన భవనాలు ఒకటి రెండు రోజుల్లోనే యధావిధిగా కొనసాగగా, మరికొన్ని భవనాలు 15 రోజుల తర్వాత ని ర్మా ణాలు కొనసాగాయన్న ఆరోపణలు ఉన్నా యి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ నగరానికి కూత వేటు దూరంలో ఉంటుంది. మున్సిపాలిటీ పరిధిలోనే టిసిఎస్, ఏరోస్పెస్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఫాక్స్ కాన్, కెన్స్ లాంటి ప్రపంచ స్థాయి కంపెనీలో ఏర్పాటు కావడంతో ఇక్క డ భూముల విలువలకు రెక్కలు వచ్చాయి. ఆయా కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారు.
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రైవేట్ హాస్టల్ ల కు డిమాండ్ పెరిగిపోతుంది... దీనిని దృష్టిలో పెట్టుకొని తమ వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు రియల్ వ్యాపారులు అక్రమ కట్టడాల కు తె రలేపుతున్నారు. ఆదిబట్ల టిసిఎస్ ఎదురుగా ఉన్న శ్రీ మిత్ర లేవుట్ లో పలు బిల్డింగ్లు జి +2 పర్మిషన్ తీసుకోని జి +3, 4, 5 నిర్మాణాలు చేపట్టారు.
అక్కడ పర్మిషన్ ఒకలా తీసుకుని, నిర్మాణాలు ఒక లా చేపడుతున్నారు. అందులో ఇంటి ని ర్మాణాలకు అనుమతులు తీసుకుని, వ్యా పార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గతంలో కూడా అక్రమ నిర్మాణాలపై కలెక్టర్, హెచ్‌ఎండిఏ, సిసిఎల్‌ఏ, మున్సిపా లిటీలలో ఎంతో మంది మున్సిపాలిటీ ప్రజ లు ఫిర్యాదులు చేసిన ఎలాంటి చర్యలు తీసుకొక పోవడం.. ఒకవేళ పై అధికారులు, రాజకీయ నేతల ఒత్తిడీల మేరకు ఒకటి, రెండు బిల్డింగ్ లు కూల్చి..
కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నిర్మాణాలు యధావిధిగా కొనసాగించడం మున్సిపాలిటలో పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి కోకొ ల్లలు. తాజాగా శనివారం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిం చిన పది నూతన భవనాల స్లాబ్ కూల్చ డం మున్సిపాలిటీలో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు పోల్చుతున్న భవన నిర్మాణ యజ మానులతో అధికారులకు సెటిల్మెంట్ కాకపోవడం వల్లనే ఈ కూల్చివేతలు చేపడుతు న్నట్లు మున్సిపాలిటీ లో గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి అధికారులు మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అన్ని నిర్మాణాలపై కూల్చివేతలు చేపట్టాలని స్థానిక మున్సిపాలిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.