05-05-2025 02:19:32 AM
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): 2025-26 ఆర్థిక సంత్సరానికిగాను వనమహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కులను నాటాలని రాష్ట్ర ప్రభత్వుం లక్ష్యంగా పెట్టుకున్నది. వర్షాలు పడటం ప్రారంభంకాగానే మొక్కలను నాటే ప్రక్రియను అటవీశాఖ చేపట్టనుంది. ఈ మొక్కలను ఒక అటవీశాఖనే కాకుండా ప్రభుత్వంలో వివిధ శాఖలకు మొక్కలను నాటే లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే గతేడాది 18 కోట్లకు పైగా మొక్కులు నాటితే.. ఇప్పుడు 2 కోట్ల మొక్కలను తక్కువగా నాటాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఏటా మొక్కల సంఖ్య పెంచాల్సింది ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంఖ్య తగ్గించడంపై పర్యావరణవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వన మహోత్సవంలో భాగంగా నాటే ఈ మొక్కలను ప్రభుత్వ భూములు, అటవీ భూములు, జాతీయ, పంచాయతీ, ఆర్‌అండ్‌బీఆర్ రోడ్లకు ఇరు వైపులా నాటుతారు.
ప్రైవేటు భూముల్లోనూ మొక్కలు నాటేందుకు రైతులను, భూ యజమానులను ప్రోత్సహించాలనే నిర్ణయం తీసుకున్నారు. పండ్లు, దశాబ్దాలు పాటు బలంగా ఉండే మొక్కలను ఎక్కువగా నాటనున్నారు. చింత, రావి, వేప, నేరెడు లాంటి మొక్కలను కూడా నాటనున్నారు.