calender_icon.png 5 May, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో..ఎలుగుబంటి భయాందోళనలో కళ్యాణి గ్రామస్థులు

05-05-2025 02:21:38 AM

ఎల్లారెడ్డి, మే 4, విజయ క్రాంతి: ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారు లోని గుట్టపై ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల, కథనం ప్రకారం.కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ,శివారు రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ,త్రాగు నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్న సమయంలో,కొద్ది దూరంలోనే ఎలుగుబంటి పుట్టను తవ్వుతున్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.వెంటనే స్థానికులు పరుగు పరుగున గ్రామం వైపు పరుగెత్తారు.