07-11-2025 12:57:36 AM
హార్షం వ్యక్తం చేసిన బెజ్జెంకి ప్రజలు
బెజ్జంకి, నవంబర్ 6: సిద్దిపేట జిల్లా బెజ్జెంకి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు ఆక్రమణలతో ఇరుకుగా మారుతున్నాయి, అంబేద్కర్ కూడలిలో రోడ్లపై వ్యాపారులు అనధికారికంగా తమ వ్యాపారాలను విస్తరించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో విజయక్రాంతి వార్త కథనం ప్రచురించింది.
దుకాణాల ముందు ఉన్న డ్రైనేజీ కాలువలపై గల అక్రమ నిర్మాణాలను గ్రామ పంచాయతీ అధికారులు గురువారం తొలగించారు. మురికి కాలువలపై నిర్మించిన మెట్లు, ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై పోసిన మట్టి కుప్పలను జేసిబీ తొలగించారు. బెజ్జెంకి మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ, అక్రమ నిర్మాణాల తొలగింపుకు కృషి చేసిన విజయక్రాంతినీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.