07-05-2025 12:52:27 AM
గజ్వేల్, మే 6: మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ తో పాటు జవాబుదారీతనం పెరగాలని సీనియర్ సంపాదకులు, కవి, రచయిత కె శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గజ్వేల్ ప్రెస్ క్లబ్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ‘జర్నలిజం గతం-వర్తమానం-భవిష్యత్తు’ అనే అం శంపై మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ సంపాదకులు, కవి, రచయిత కె శ్రీనివాస్, టీయూడ బ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రస్తుతం ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు జవాబుదారితనం పెరగాలని, జవాబుదారీతనం లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తు తం సోషల్, డిజిటల్ మీడియా దారి తప్పకుండా ఉండాలంటే ప్రధాన మీడియా వా టికి ఆదర్శంగా నిలవాలని సూచించా రు.
గతంలో ప్రింట్ జర్నలిజంలో వడపోత ప్రక్రి య ఉండేదని, ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లుగా వారు ఏది పడితే అది మాట్లాడుతు న్నారని అన్నారు. కొత్తగా మీడియాలోకి వచ్చే వారికి ఎటువంటి హద్దులు లేవని, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఇష్టానుసారంగా మీడియాను వాడుతున్నారన్నారు. రాజకీ య పార్టీలు విచక్షణ రహిత జర్నలిజాన్ని ప్రోత్సహించవద్దని కోరారు.
అనంతరం మీడియా పరిస్థితి పూర్తిస్థాయిలో దెబ్బతిన్నదని, గతంలో 200 నుంచి 300 చిన్న పత్రికలు ఉండేవ ని , ప్రస్తుతం 500 నుంచి 600లకు చిన్న పేపర్లు సంఖ్య పెరిగిందని, కానీ సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు వాడటం వల్ల మీడియాలో దుర్భాష పెరిగిపోయిందన్నారు. సోషల్ మీడియా కు చట్ట బద్ధత కల్పించే దిశగా జర్నలిస్టు సంఘాలు కృషి చేయాలని కోరారు. చెడు ఎప్పుడు ఉంటుందని...
సమా జం ఆదరణ లేనప్పు డు ఎవరైనా విఫలం చెందడం ఖాయమన్నారు. సామాజిక స్పృహతో జనం పక్షాన నిలబడి పనిచేస్తున్న గజ్వేల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులను వారు అభినందించారు. మీడియా, సమాజం పట్ల కనీస అవగాహన లేని వారిని జర్నలిస్టులుగా గుర్తించవద్దన్నా రు. అక్షర జ్ఞానం లేని వారు. ఎన్నో స్పూర్తి దాయక కార్యక్రమాలతో జిల్లాకే గజ్వేల్ ప్రెస్ క్లబ్ స్పూర్తిని నింపిందని, గజ్వేల్ ప్రెస్ క్లబ్ స్పూర్తితోనే తాము జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించినట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి తెలిపారు.
ప్రస్తుతం చర్చ నీయాంశమైన అంశంపై గజ్వేల్ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం శుభపరిణామం అని, ఈ స్పూర్తితో జిల్లా వ్యాప్తం గా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృపాకర్ రెడ్డి, ఎల్లం, తాడెం నర్సింలు, జగదీశ్వర్, డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ జహంగీర్, నాయకులు దేవేందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కొట్టాల గణేష్, కొన్యాల బాల్ రెడ్డి, కుంట్ల లక్ష్మారెడ్డి, అంబేద్కర్ సంఘం, ప్రజా సంఘాలు నాయకులు, దాదాపు 350 మంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.