calender_icon.png 7 May, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో హైడ్రా కొరడా..

07-05-2025 12:52:39 AM

- సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీహాల్ కూల్చివేత

- అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులు కూడా నేలమట్టం

- భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు 

- కాటేదాన్‌లో ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీకి రహదారి ఏర్పాటు

-భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు 

 రాజేంద్రనగర్, మే 6: హైడ్రా అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం గచ్చిబౌలిలో అక్రమంగా నిర్మించిన సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్, అదేవిధంగా కిచెన్ రూములను కూల్చివేశారు. ఫర్టీలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు.

లే అవుట్లో రోడ్లు, పార్కులను ఆక్రమించడంతో పాటు తమ ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ యజమానులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు ఫిర్యాదు చే యడంతో సంబంధిత శాఖ అధికారులు రం గంలోకి దిగారు. హైడ్రా ఫోర్స్ భారీ బందోబస్తుతో జేసీబీలతో ఆక్రమణలను తొలగిం చారు. దీనితో పాటుగా అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్ కోర్టులను సైతం హైడ్రా అధికారులు తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

కాటేదాన్‌లో..

 రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్లో కాటేదాన్ నుంచి ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీకి వెళ్లే దారిని ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఆక్రమించాడు. దీంతో తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు హైడ్రాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉదయం రంగంలోకి దిగారు.

రోడ్డుపై ఉన్న ప్రహరీని నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అమ్ము కొన్ని సంవత్సరాలుగా సమస్య ఎదుర్కొంటున్నామని ఈ విషయమై గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, అధికారులు సమస్యకు పరిష్కారం చూపారని సంతోషం వ్యక్తం చేశారు.