calender_icon.png 7 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయినగర్ గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

07-05-2025 12:50:50 AM

- టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ 

- వ్యక్తిగతంగా బాధితులకు రూ. 3 వేల చొప్పున ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ

ఎల్బీనగర్, మే 6: అగ్ని ప్రమాదం ఘటనలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన నాగోల్ సాయి నగర్ గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద పక్కా గృహాలను కట్టించి ఇస్తామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ హామీ ఇచ్చారు. నాగోల్ డివిజన్ లోని సాయి నగర్  కాలనీని  మంగళవారం ఆయన సందర్శించారు.

ప్రమాదంలో కాలిపోయిన గుడిసెలు,  బియ్యం , బట్టలు, పుస్తకాలు,  గృహోపకరణాలు కాలి బూడిదైన తీరు ను చూసి చలించిపోయారు. బాధితులను పరామర్శించి,  కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరో సా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేసే విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్తామన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సాయినగర్ గుడిసవాసులు అందరికీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 5లక్షల ఆర్థిక సహాయంతో పక్కా ఇల్లు కట్టించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ గారితో మాట్లాడినట్లు తెలిపారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు రూ. 3వేల చొప్పున వ్యక్తిగతంగా తక్షణ సహాయాన్ని అందజేశారు.

ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబా ల కు రూ.6 వేలచొప్పున నగదు, బియ్యం అందించేలా ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ అంగీకరించారని పేర్కొన్నారు. కానీ రూ.12 వేల చొప్పున ఇవ్వాలని కలెక్టర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. బాధితులు ఇల్లు నిర్మించుకునే వరకు వారు తలదాచుకునేందుకు జీహెచ్‌ఎంసీ  వార్డు కార్యాలయంలో బస ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

సాయి నగర్ గుడిసెల్లో 620 కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ, 450 మంది వరకే ఇళ్ల పట్టాలు ఉన్నాయని, వారితోపాటు మిగతా వారందరు కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు.

సీపీఐ నాయకులు ఈటీ నర్సింహ, రవీంద్రాచారి, చందు తదితరలు కూడా మధుయాష్కీని కలిసి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మంజులా రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, కుట్ల నర్సింహ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, గణేష్ నాయక్, నాయకులు చెరుకు చిరంజీవి గౌడ్, భవాని శంకర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్, ఉరిపక్క రవి, గణేష్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, కవిత తదితరులు ఉన్నారు.