calender_icon.png 6 July, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ్‌సాగర్‌రావుతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం భేటీ

10-06-2025 01:22:52 AM

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు భంగపడ్డారు. తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం హైదరాబాద్‌లోని ప్రేమ్‌సాగర్‌రావు నివాసానికి వెళ్లారు. కొన్నిగంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు. భవిష్యత్‌లో పార్టీ కచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని వారు సముదాయించారని తెలసింది.