29-10-2025 07:35:37 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల(కళాశాల) ను డిప్యూటీ తహశీల్దార్ హేమంత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు గురుకుల పరిసరాలను పరిశీలించిన ఆయన మెనూ ప్రకారం వండిన వంటకాలను విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. ప్రతి రోజూ రుచికరమైన భోజనం అందించాలని హాస్టల్ వార్డెన్ ను సూచించారు. అనంతరం విద్యార్థుల అభ్యాసాన్ని పరిశీలించారు.