calender_icon.png 26 August, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పల్లెకు పల్లె వెలుగు బస్సు

25-08-2025 05:59:59 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపో పరిధిలోని ప్రతి పల్లెకు పల్లె వెలుగు బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి బస్సులను నడిపించేందుకు ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కొన్ని ఏళ్లుగా ప్రయాణికులు ఆదరించక, రవాణా మార్గం సరిగ్గా లేక రద్దు చేసిన పలు గ్రామాలకు బస్సులను పునరిద్దిస్తున్నట్లు డిపోమేనేజర్ కే.పండరి తెలిపారు.

నిర్మల్ నుండి వెల్ మల్, బొప్పారం, కూచనపెల్లి గ్రామానికి ఉద!! 09.45 ని!!లకు నిర్మల్ నుండి ముజ్గి ఉద!! 11:15 ని!!లకు సా!! 3:45, ని!!లకు నిర్మల్ నుండి మునిపెల్లి మల్లాపూర్ కు అదనంగా మ!! 1:20 ని!! లకు, మహారాష్ట్ర ప్రాంతమయిన అప్పారావు పేట్,  మలక్ జామ్ లకు ఉద: 9.50 మ: 2 గం!! లకు సా!!5.10 ని!!లకు ప్రజలు ప్రయాణికులు అడగకుండానే బస్సులు వేసామని ఆయా గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగ పరచుకొని ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి సహకరించాలని డిపోమేనేనేజర్ కే.పండరి తెలిపారు.