25-09-2025 11:45:23 PM
నాగోల్ లోని జీఎస్ఐలో స్వేచ్ఛతా కార్యక్రమం
ఎల్బీనగర్: స్వచ్ఛతతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్, హెచ్వోడీ బసబ్ ముఖోపాధ్యాయ అన్నారు. నాగోల్ లోని బండ్లగూడ భారతీయ భూవైజ్ఞానిక సర్వే సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్ పేరుతో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో జీఎస్ఐ దక్షిణ ప్రాంతానికి చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్చత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... పౌరులు తమ పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడాలన్నారు. కార్యక్రమంలో జీఎస్ఐ అధికారులు, జీఎస్ఐ పీఆర్వో గంజి మల్లేశ్, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, బండ్లగూడ ప్రజలు పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు.