08-07-2025 12:04:59 AM
కొత్తకోట జులై 07 : కొత్తకోట పట్టణ కేంద్రంతో పాటు మండల కేంద్రము రామకృష్ణాపురం, పామాపురం, నాటవెళ్లి గ్రామంలో నిర్వహించిన మొహర్రం వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కుటుంబం సతీసమేతంగా వచ్చి మొక్కులు చెల్లించారు. హిందూ ముస్లింలు కలిసి మెలిసి ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలని అంతేకాకుండా అల్లా దయతో అం దరూ చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.