08-07-2025 12:06:45 AM
టియుడబ్ల్యూజే (ఐజేయు) నాయకులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 7 (విజయ క్రాంతి) : పాలమూరు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని, జర్నలిస్టులందరికీ తాను అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టియుడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యెన్నం ను కలిసి జర్నలిస్టుల ఇండ్ల సమస్యలు , త దితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల సమస్యల విషయంలో తనకు పూర్తి అవగాహన ఉందని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తాను న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అతి త్వరలోనే యూనియన్ మహాస భ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్లు నాయకులు ఎమ్మెల్యేకు తెలుపడం తో తాను కూడా వస్తానని సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా నాయకులు పాల్గొన్నారు.