calender_icon.png 30 September, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూజెర్సీలో వికసిత భారత్ రన్

30-09-2025 01:18:41 AM

పాల్గొన్న ప్రవాస భారతీయులు

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలో వికసిత్ భారత్ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసీ భారతీయులు పాల్గొని జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టారు. భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని శ్రీశివ విష్ణు ఆలయం సాయిదత్త పీఠం ఆధ్వర్యంలో ఈ రన్‌ను నిర్వహించారు.

భారతీయ ఐక్యత, ప్రగతిని వికసిత భారత్ రన్ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో న్యూయార్క్ నుంచి డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా విశాల్ జయేష్ భాయ్ హర్ష్, న్యూ జెర్సీ మాజీ డిప్యూటీ స్పీకర్, కమిషనర్ ఎమిరిటస్ ఉపేంద్ర చివుకుల, సాయి దత్త పీఠం శ్రీశివ విష్ణు మందిరం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి, కమ్యూనిటీ లీడర్స్ కృష్ణారెడ్డి అనుగుల, విలాస్ జంబుల, దాము గేదెల, తానా, ఆట, నాట్స్, టీటీఏ, మాటా, టీఫాస్, హెచ్‌ఎస్‌ఎస్, ఇండో అమెరికన్ సంస్థతో పాటు, పలు స్థానిక, జాతీయ ప్రవాస భారతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.