30-09-2025 01:17:44 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ర్ట ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు.
ఇంతకు ముందు ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఐఎఫ్‌ఎంఎస్ చెక్కుల నగదును విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు టీపీఎస్‌ఎఫ్ రాష్ర్ట అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.