calender_icon.png 30 August, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.234 కోట్లతో అభివృద్ధి

30-08-2025 12:00:00 AM

  1. ప్రతి మహిళా మహిళా సంఘాల్లో చేరాలి
  2. ప్రతి మహిళకు అన్నగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  3. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో  మంత్రి సీతక్క

ములుగు, ఆగస్టు 29 (విజయక్రాంతి): ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో 35లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులు, 33/11 విద్యుత్ ఉపకేంద్రం,ఇంచర్ల గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం, వెంకటాపూర్ మండలం జవహర్ గ్రామంలోని మాడల్ పాఠశాలలో 4.5లక్షల రూపాయలతో చేపట్టిన కిచెన్ షెడ్ నిర్మాణ పనులు 12లక్షల రూపాయలతో చేపట్టనున్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులను,గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో  45 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు,

దుంపిల్లగూడెం గ్రామంలో 10లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన,పస్రా గ్రామంలో 55లక్షల నిధులతో  నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు&కాలువలను,పస్రా గ్రామంలో ఓల్ బోడ్రాయ్ నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు 20లక్షలతో నిర్మిం చిన సిసి రోడ్డును  ప్రారంభోత్సవంలతో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలను గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా రూ. 234 కోట్లతో సీసీరోడ్ల పనులు, మంత్రి సీతక్క నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలలో మంత్రి సీతక్క మాట్లాడుతూ చెక్ డ్యాముల నిర్మాణ పనులతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తద్వారా పశువులకు మీరు లభ్యమవుతుందని అన్నారు. గ్రామాల్లోని మహిళలందరూ మహిళా సంఘాలలో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్నగా నిలుస్తూ 60సంవత్సరాలు దాటిన మహిళలు సైతం సంఘాలలో చేరడానికి అవకాశం కల్పించాలని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న మహిళ గ్రూపుల అందరికీ ప్రభుత్వం వడ్డీ రుణాలను చెల్లించిందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చేసుకుంటున్న నిరుపేదలకు స్త్రీ శక్తి ద్వారా లక్ష రూ పాయల రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు. మహిళా సంఘాలలో సభ్యురాలైన మహిళ ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆమె కుటుంబానికి రూ. 2లక్షల ఎక్స్గ్రేషియా అందజేస్తున్నదని, మహిళా సంఘాల సభ్యురాళ్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా చీరలను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక వైపు సంక్షేమ పథ కాలను అమలు చేస్తూనే మరోవైపు అభి వృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని,ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం,రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు.