26-08-2025 02:08:23 AM
- యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- సింగిల్ విండో కార్యాలయంలో బి.ఆర్.ఎస్ నాయకుల నిరసన
- చెదరగొట్టిన పోలీసులు
గోపాలపేట ఆగస్టు 25 : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీలో విఫలమైందని టిఆర్‌ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా గోపాల పేట మండలం కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో సోమవారం బి ఆర్ ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.
పంట పొలాల్లో ఉన్న రైతన్నలు యూరియా కోసం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు లు ఉన్నచోటికే ప్రభుత్వం యూరియాని అందజేసిందని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభు త్వం పాలనలో ఏ ఒక్కరోజు కూడా యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన దాఖలాలు లేవని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతన్నలు యూరియా కో సం ఎదురు చూపులే తప్ప ఎక్కడ కూడా యూరియాను అందుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు యూరియా సరఫరా చేసేందుకు కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు విఫలమైనట్లు చెప్పారు. ఇప్పటికైనా ఈ రెండు ప్రభుత్వాలు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సరైన టైంలో యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం సింగిల్ విండో కార్యాలయం వద్ద బి ఆర్ ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని బి ఆర్ ఎస్ నాయకులను శాంతింప చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పటికైనా రైతాంగానికి అండగా నిలుస్తుందని ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బాలరాజు మాజీ vise ఎంపీపీ చంద్రశేఖర్ మాజీ కో ఆప్షన్ మతీన్. మ న్యం నాయక్ నాలువోతూ వెంకటేష్ వడ్డె గోపాల్ జహంగీర్ గాజుల శ్రీను రమేష్ లో ఉన్నారు.