17-11-2025 12:17:02 AM
ములుగు,నవంబరు16(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మే డారం శ్రీసమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి క్షేత్ర స్థాయిలో ఆదివారం పరిశీ లించారు.
వచ్చే సంవత్సరం జనవరి 28నుం డి 31వ తేదీ వరకు జరిగిన శ్రీమేడారం స మ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో అనుకున్న సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని, భక్తుల మనో భావాలు దెబ్బ తినకుండా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి సీత క్క అన్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బంధువుగా బాధ్యుడిగా వ్యవహరిస్తూ అమ్మవార్ల జాతరను విజయవంతం చేయడానికి చొరవ చూ పుతున్నారని,అమ్మవార్ల కీర్తి ప్రతిష్టలను ప్ర పంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా ముం దస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడమే కాకుం డా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగు తున్నాయని వివరించారు.
జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారంలో పాటు పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు చేస్తున్నా మని, అన్ని అభి వృద్ధి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రానున్న మేడారం జాతర సందర్భంగా హన్మకొండ జిల్లా కేంద్రం నుండి తాడ్వాయి మండల కేంద్రం వరకు పలు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటు వారి కి ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
భక్తి, శ్రద్ధ, బాధ్యతతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నామని ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని సీతక్క తెలిపారు.