calender_icon.png 17 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్‌పై సన్నగిల్లిన రైతుల ఆశలు

17-11-2025 12:19:05 AM

  1. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 ప్రకటన

యాసంగి వడ్ల బోనస్ ఇప్పటి వరకూ ఇవ్వని ప్రభుత్వం

మరిపెడ మండలంలో తొమ్మిది వేల మంది రైతులకు అందని బోనస్

మరిపెడ, నవంబర్ 16 (విజయ క్రాంతి)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ లంలో 9 వేలకు పైగా మందికి పైగా రైతులకు యాసంగిలో విక్రయించిన ధాన్యం బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతు ల ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం వానకాలం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో కొత్తగా ధాన్యం విక్రయించేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు యాసంగి బోనస్ డబ్బులు అందక రైతులు నిరాశ చెందుతున్నారు.

కేంద్రం ఈ ఏడాది వడ్ల మద్దతు ధర స్వల్పంగా పెంచింది. సాధారణ వరికి 2300, ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ. 2369 చెల్లించింది. ఈసారి మరో రూ.60 పెంచింది. సాధారణ రకానికి రూ. 2,369, ఏ గ్రేడ్ రకం రూ. 2389 చెల్లించనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం గత వానకాలం నుంచి సన్న రకం ధాన్యానికి క్విం టాలకు 500 రూపాయలు అదనంగా బోన స్ ప్రకటించింది.

దీంతో గత వానాకాలం చాలామంది రైతులు సన్నవడ్లు సాగు చేశా రు. సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించింది. గత వానాకాలం సీజన్లో బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో యాసింగిలో మరింత మం ది సన్న వడ్లు సాగు చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం బోనస్ మాత్రము ఇప్పటివరకు చెల్లించలేదు.

దా న్యం విక్రయించి ఆరు నెలలు గడిచినా బోనస్ ఊసే లేదు. మరోవైపు వానాకాలం కూడా చాలామంది రైతులు సన్నవడ్లు సాగు చేశారు. ఈసారి కూడా కొనుగోలు కేంద్రాలు వేరువేరుగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు బోనస్ పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో రైతు ల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

యాసంగి సీజన్ కు సంబంధించి మరిపెడ మండలంలో వివిధ గ్రామాల ఐకెపి సెంటర్ల నుండి గత సంవత్సరం రైతుల నుంచి సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. యాసంగి లో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లకు సంబంధించిన బోనస్ డబ్బులను చెల్లించాలని రైతులకుకోరుతున్నారు.

గత సంవత్సరం రైతుల 18 వేల మెట్రిక్ ట న్నుల సన్న వడ్ల బోనస్ 9 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దు డిసెంబర్ చివరి నాటికి రైతుల ఎకౌంట్లో బోనస్ డబ్బులుజమవుతాయి.

వీరా సింగ్ మరిపెడ మండల అగ్రికల్చర్ ఆఫీసర్.

రాష్ట్ర ప్రభుత్వము సన్న వడ్ల పై 500 బోనస్ ప్రకటించడంతో గత సంవత్సరం 64 కింటాలు వడ్లను ఐకీపీ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఇప్పుడు వరకు నాకు బోనస్ డబ్బులురాలేదు.

బానోతు రామ