18-10-2025 12:00:00 AM
హెల్త్ చెక్‌అప్ ప్యాకేజీలపై రాయితీ ఇచ్చిన విజయ డయాగ్నస్టిక్
హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాంతి): హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రో పాలిటన్ కమిషనర్ (జనరల్) సెక్రటరీ శ్రీవత్స కోట ఉద్యోగులకు నిర్వహించిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 150 మందికిపైగా ఉద్యోగులు ఆరోగ్య, కంటి, దంత పరీక్షలు చేయించుకున్నారు. విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ఈ శిబిరం సందర్భంగా నమోదు చేసుకున్న ఉద్యోగులకు సమగ్ర హెల్త్ చెక్‌అప్ ప్యాకేజీలపై 50% నుంచి 65% వరకు రాయితీను అందించింది. ఈ వైద్య శిబిరానికి ఉద్యోగుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఉద్యోగుల ఆరోగ్య అవగాహన మరియు శ్రేయస్సు పెంపొందించడంలో చేసిన కృషికి విస్తృతంగా ప్రశంసలు పొందింది.