calender_icon.png 13 May, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

13-05-2025 12:19:20 AM

- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

- జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష 

పటాన్ చెరు, మే 12 :బల్దియా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నిర్దేశించిన గ డువు లోగా పనులు పూర్తిచేసి ప్ర జలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సూచించారు.

సోమవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రపు రం, భారతి నగర్, పటాన్ చెరు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు డివిజన్ల పరిధిలో శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. 

నిర్మాణ దశలో ఉన్న పనులపై  అధికారులు రోజు వారి తనిఖీలు చేపట్టాలన్నారు. నిధులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అభివృద్ధి పనులు నిర్లక్ష్యం వహి స్తే ఇబ్బందులు తప్పవని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బల్దియా సర్కిల్ 22 ఈఈ సురేష్, డీఈ లు నరేందర్, దేవేందర్, ఏఈ లు శివ కుమార్, దివ్య తేజ లుపాల్గొన్నారు.