calender_icon.png 25 December, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4న టీ హబ్‌లో ఎగ్జామ్ థాన్

25-12-2025 01:57:36 AM

హాజరు కానున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

ముషీరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): విద్యార్థులకు పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఎగ్జామ్ థాన్ ను జనవరి 4న టీ హబ్ లో నిర్వహిస్తున్నట్లు కాలేజ్ మెంటర్ వ్యవస్థాపకుడు రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎగ్జామ్ థాన్ 3 కేటగిరిల్లో 3, 5, 10 కిమీల్లో జరుగుతుందని అన్నారు. ఎగ్జామ్ థాన్ ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐఏఎస్ అధికారులు పాల్గొంటారని తెలిపారు.

ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎగ్జామ్ థాన్ కు సంబంధించిన వాల్ పోస్టర్, టీ షర్ట్ లోగోను కావేరి యూనివర్సిటీ వీసీ డా.ప్రవీణ్ కుమార్, డా.అమ రేందర్, జయంత్ రెడ్డి, అర్చన సభలు ఆవిష్కరించారు. అనంతరం డా.ప్రవీణ్ రావు మాట్లాడుతూ దేశంలో 80-90 శాతం విద్యార్థులు పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొం టున్నారని అన్నారు. డ్రాపౌట్స్ తో మానసిక ఒత్తిడికి లోనై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్ష దశల్లో వారికి సమిష్టి భరోసా కల్పించాలని ఆయన అన్నారు. ఒత్తిడి లేని అభ్యాసం కావేరి విశ్వ విద్యాలయంలో బోధిస్తున్నామని చెప్పారు. వారంలో ఒక రోజు విద్యార్థులకు సైకాలజిస్టులతో పాఠాలు చెప్పిస్తున్నామని తెలిపారు.