calender_icon.png 2 November, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవ ప్రతిజ్ఞ

01-11-2025 08:03:13 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించబడుతున్న విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలలో భాగంగా, సింగరేణి సంస్థలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 02 వరకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం దిశా నిర్దేశాలతో, విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో చేసే పౌరుల సత్యనిష్ట ప్రతిజ్ఞ, ఈ వారోత్సవ కాలంలో వివిధ కంపెనీ కార్యక్రమాలలో ఉద్యోగస్తులతో,పాటు వారి కుటుంబ సభ్యులతో హాజరవుతున్న  ప్రదేశాలు సిఈఆర్ క్లబ్, సేవా సెంటర్స్ కూడా పౌరుల సత్యనిష్ట ప్రతిజ్ఞ చేయాలని సూచించారు.

అందులో భాగంగా శనివారం విజిలెన్స్ అవగాహన వారోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం 3ఇంక్లైన్, బంగ్లాస్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కొత్తగూడెం సేవా అధ్యక్షురాలు జి. మధురవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగరేణి నందు విజిలెన్స్ అవగాహనా వారోత్సవ ప్రతిజ్ఞ అయినా పౌరుల సత్యనిష్ట ప్రతిజ్ఞను ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞను చేసి పాటించాలనే దృక్పథంతో, ఈ నిర్ణయాన్ని తీసుకున్న గౌరవనీయులు సంస్థ చైర్మన్ కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముఖ్య ఉద్దేశం   పారదర్శకత, జవాబుదారీతనం, సత్ప్రవర్తన పెంపొందించుట, ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీ, నిబద్దతను పాటించాలని, ఈ కార్యక్రమానికి హాజరైన సేవాసభ్యులు, మహిళ క్లబ్ సభ్యులకు  తెలియజేశారు. 

చిన్నారులకు కూడా ఈ రకమైన సత్ప్రవర్తన నేర్పించినట్లైతే భవిష్యత్తులో, ఎటువంటి అపోహలకు దురాశలకు పోకుండా కచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూ, జీవిస్తారని తద్వారా అవినీతి నిర్మూలనకు, కృషి చేసిన వారమైతామని అందుకు అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. “జాగరూకత: మా భాగస్వామ్య బాధ్యత (విజిలన్స్ ఔర్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ)” అనునది ఈ సంవత్సర విజిలెన్స్అవగాహన వారోత్సవాల నినాధము అని తెలిపారు. ఈ సందర్భంగా డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు, వృత్తి శిక్షణ కార్యక్రమాల ఫాకల్టీ, ట్రైనీ అభ్యర్దుల చేత అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు శ్రీమతి జి మధురవాణితో పాటు, డీజీఎం పర్సనల్ జీవి మోహన్ రావు పద్మజా కోటిరెడ్డి, లేడీస్ క్లబ్ సెక్రటరీ సునీత మురళి, సేవా సెక్రటరీ వై. అనిత, సేవ సభ్యులు లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.