calender_icon.png 28 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడిగె రూపంలో పగిడిద్దరాజు

28-01-2026 12:34:36 AM

మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి మేడారానికి.. 

రాత్రి లక్ష్మీపురం గ్రామంలో బస

నేడు సాయంత్రం 6:30 గంటలకు గద్దెల వద్దకు పగిడిద్దరాజు 

మేడారం, జనవరి 27 (విజయక్రాంతి): గిరిజనుల మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మేడారానికి తీసుకెళ్తారు. పెళ్లి ఘట్టం నిమిత్తం మేడారానికి మంగళవారం అత్యం త భక్తిశ్రద్ధలతో పెనుక వంశీయుల ఆధ్వర్యంలో  గిరిజన సంప్రదాయాల ప్రకారం పడిగే రూపంలో బయలుదేరారు. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పూజారుల బృందం, మంగళవారం పస్ర సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో బస చేసి, బుధవారం ఉదయం పడిగవాగు వద్ద జంపన్నవాగులో స్నానలు చేసి, అనంతరం సాయంత్రం 6:30 గంటల వరకు మేడారంలోని పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు.

ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని పెనుక వంశీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించను న్నారు. ఈ ప్రధాన ఘట్టం సజావుగా సాగేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు. పగిడిద్దరా జు మేడారంకు బయలుదేరిన సందర్భంలో మంత్రి సీతక్క పూనుగొండ్లకు చేరుకొని, గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పూజారు లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారంకు ఘనంగా సాగనం పారు. గిరిజన ఆచారాలకు, వారి విశ్వాసాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందనే విషయాన్ని మరోసారి మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు.