calender_icon.png 23 May, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాకర్‌రావు ఇంటికి నోటీసులు

23-05-2025 12:00:00 AM

  1. జూన్‌లో విచారణకు రావాలని ఆదేశం
  2. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం

కార్వాన్, మే 22: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపిం గ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలత సూత్రధారి అయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటికి గురువారం పోలీసులు నోటీసులు అంటించా రు. జూన్ 20 లోగా కోర్టు ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ ఉన్న ప్రభాకర్‌రావు అమెరికాకు పారిపోయారు.

ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నిర్ణ యం వెలువరిస్తూ న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ప్రభాకర్‌రావుకు కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఒకవేళ తప్పించుకొని తిరిగితే, అఫెండర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గురువారం కార్వాన్ సర్కిల్, గోల్కొండ డివిజన్ పరిధిలోని వెసెల్లా మెడోస్‌లోని ప్రభాకర్‌రావు ఇంటికి నోటీసులు అతికించారు.