20-07-2025 12:35:43 AM
బల్కంపేట, ఉజ్జయిని అమ్మవార్లను దర్శించుకున్నారు: డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్, జూలై 19 (విజయక్రాంతి):- తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండగ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వైభవంగా జరిగిందని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు.
బోనాల నేపథ్యంలో బల్కంపేట అమ్మవారిని 7 లక్షల మంది... సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని 18 లక్షల మంది.. ఇలామొత్తంగా 25 లక్షల మంది భక్తులు దర్శించుకు న్నారని పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరిగాయని.. అందుకు అమ్మవార్లను దర్శించుకున్న భక్తు ల సంఖ్య నిదర్శనమని అన్నారు. బోనాల విజయవంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతతో కృషి చేసిందని చెప్పారు.
ఇందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో అటు బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో, ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో నెలరోజుల ముందు నుంచే వరుసగా పోలీస్, GHMC శానిటేషన్, ఎలక్ట్రికల్, వాటర్ వరక్స్ తో సహా అన్ని డిపార్ట్మెంట్స్ తో సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఆ సమా వేశాల్లో భాగంగా అధికారులకు పలు సూచ నలు చేశామన్నారు.
బల్కంపేట అమ్మవారిని 7 లక్షల మంది... సికింద్రాబాద్ ఉజ్జయి ని మహాకాళి అమ్మవారిని 18 లక్షల మం ది.. ఇలామొత్తంగా 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరిగాయని.. అందుకు అమ్మవార్లను దర్శించు కున్న భక్తుల సంఖ్య నిదర్శనమని అన్నారు.