calender_icon.png 21 July, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిట్ మరోసారి నోటీసులు

20-07-2025 12:34:02 AM

శనివారం డుమ్మా కొట్టడంతో వారం రోజుల్లో రావాలని సూచన

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సిట్ రెండో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14న సిట్ అధికారులు ప్రవీణ్ కుమార్‌కు నోటీసులు పంపారు. రెండు రోజుల్లోగా, ఉదయం 11 నుంచి సా యంత్రం 6 గంటల మధ్య విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

అయితే, నోటీసులు అందినా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు సిట్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విచారణకు కూడా హాజరుకాలేదు. దీం తో శనివారం తాజాగా రెండోసారి నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లో విచారణకు హాజరై వాగ్మూలం ఇవ్వాలని స్పష్టం చేసింది. హాజరయ్యే సమయాన్ని ముందుగానే తెలపాలని కూడా కోరింది. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తున్నట్టు సమాచారం.

గతం లో, బీఎస్పీ రాష్ర్ట అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్‌ను గత ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని, ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై అప్పట్లో ఎన్నికల సంఘం ఈసీ, డీజీపీకి సైతం ఫిర్యాదు చేసి, విచారణ హాజరు కాకపోవడం విశేశం.