calender_icon.png 21 July, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపీనాథ్ జ్యువెలరీ వార్షికోత్సవం

20-07-2025 12:37:27 AM

హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి, జూలై 19 (విజయక్రాంతి): వనపర్తి పట్టణంలో గోపీనాథ్ జ్యువెలరీ మూడవ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. వ్యాపార సంస్థలు సమాజానికి విలువైన సేవలు అందించాలని, విలువైన సేవలు అందించినప్పుడే వారి సమస్త విజయం అందుకున్నట్లు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా షాపు యజమానికి మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

“మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంస్థను సందర్శించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కులవృత్తిని నమ్ముకొని వ్యాపార రంగంలో వృద్ధి పథంలో ముందుకుసాగుతున్న స్వర్ణకారుడు, యువతకి ఉపా ధి అవకాశాలు, వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తూ సమాజానికి విలు వైన సహకారం అందిస్తోంది అని, ఈ సంస్థ స్థాపకుడి దూరదృష్టి, కార్యదర్శులు ప్రదర్శిస్తున్న నిబద్ధత, మిత్రుల సమిష్టి శ్రమ ఇవన్నీ కలిసే ఈ విజయానికి కారణం. ఇలాగే సమర్ధత, నైతికత, సామాజిక బాధ్యతతో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలి” అని కాంక్షించారు. స్థానిక మాజీ కౌన్సిలర్ ప్రేమనాథ్ రెడ్డి, వాకిటి శ్రీధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.